*6 గ్యారంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి ఎన్నో హామీలను ఇచ్చి మరిచిన విషయం గుర్తుకు బిజెపి నాయకులు చేస్తున్నాం*
*బిజెపి జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నాయకులు ప్రశ్నిస్తున్నారు*
*నేడు మెదక్ చర్చికి వస్తున్న ముఖ్యమంత్రి కి ఆరు సవాళ్లు చేస్తున్నాం అన్నీ అమలు చేయాలి*
తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 24:
మెదక్ పట్టణానికి వస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని అధికారంలోనికి వచ్చి ఎన్నో హామీలను ఇచ్చి మరిచిన విషయం గుర్తు చేస్తూ బిజెపి మెదక్ జిల్లా పక్షాన 6 ప్రశ్నలు వేస్తా ఉన్నాం వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ సందర్భంగా విచ్చేస్తున్నప్పుడు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కావచ్చు వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు ఆ సందర్భంగా టిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీల నాయకులు నల్లబెలున్ల తో నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేసినటువంటి మీరు అభివృద్ధి నిరోధకులు అయినటువంటి మీరు మెదక్ అభివృద్ధి గురించి ఎలాంటి నిధులను ఇస్తున్నారు ముందుగా చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చర్చి అభివృద్ధికి 29 కోట్ల నిధులను మేము స్వాగతిస్తా ఉన్నాం గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏడుపాయల వనదుర్గా మాత అభివృద్ధికి 100 కోట్లు జీవో ఎంఎస్ నెంబర్ 378 /2023 వ సంవత్సరము ద్వారా ఇచ్చినటువంటి జీవోను కంటిన్యూ చేస్తారా పున పరిశీలిస్తారా కొత్త జీవో తీసుకొస్తారా ఎంత నిధులు ఇస్తారు చెప్పాలి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి మెదక్ రామ్ దాస్ చౌరస్తాలో అదేవిధంగా నరసాపూర్ బహిరంగ సభలో ఇచ్చిన హామీలను నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభం గాని మెదక్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలుపుతామని చెప్పినటువంటి హామీలు నెరవేర్చిన తర్వాత మీరు మళ్ళీ కొత్త హామీలు ఇవ్వడానికి రావాల్సిందిగా కోరుతున్నాము మెదక్ లో మూతపడిన పీజీ కళాశాల మహిళా కళాశాల ఎప్పుడు తెరుస్తారని అడుగుతున్నాం అవుసుల పల్లి నుంచి రాజు పల్లి వరకు బైపాస్ రోడ్డు ఎప్పుడు ప్రారంభం చేస్తారని మేము అడుగుతా ఉన్నాం. మెదక్ నుంచి సిద్దిపేటకు తరలించిన ఫారెస్ట్ కార్యాలయాలు ఎప్పుడు మెదక్ తీసుకొస్తారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఒక టేబుల్ నాలుగు కుర్చీలకే పరిమితమా డిగ్రీ కళాశాల ఫ్యాకల్టీ లేని డిగ్రీ కళాశాల రామాయంపేటలో ఉంది ఫ్యాకల్టీని ఎప్పుడు నియమిస్తారు అదేవిధంగా హాస్పటల్ లో డాక్టర్లను ఎప్పుడు నియమిస్తారు రామాయంపేట సబ్ కోర్టును ఎప్పుడు ప్రారంభిస్తారు తెలియజేసినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నటువంటి ప్రతిపాదనలలో మెదక్ జిల్లాను ఎందుకు విస్మరించారు. అని మేము అడుగుతా ఉన్నాం. మెదక్ నుంచి బీదర్ మెదక్ నుంచి గజ్వేల్ హైవే ప్రతిపాదనలు మీరు పంపండి అదేవిధంగా మెదక్ నుంచి మిర్జాపల్లి రైల్వే స్టేషన్ పంపండి పంపితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా మా ఎంపీ రఘునందన్ రావు గారి కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ ఇచ్చిన హామీలను ముందు నిలబెట్టుకొని కొత్త అభివృద్ధి పనులను ప్రారంభించాలని తెలియజేస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చే అంతవరకు బిజెపి మెదక్ జిల్లా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము ఈ సమావేశంలో బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ తో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎల్ఎన్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నందా రెడ్డి, మోర్చాల జిల్లా అధ్యక్షులు, గడ్డం కాశీనాథ్, సతీష్,బెండవీన, మండల అధ్యక్షుడు ప్రభాకర్ మొదలగువారు పాల్గొన్నారు.