*ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలి*
*ఏడుపాయాలలో ముఖ్య మంత్రి పర్యటన ఏర్పాట్లలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ *
తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 24:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఏడుపాయల్లో ముఖ్యమంత్రి పర్యట ఏర్పాట్లను పరిశీలిస్తూ ఇలాంటి లోటుపాటు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ చేసి బార్కెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. హెలిపాడ్ దిగే ప్రదేశాన్ని పరిశీలించారు. ఏడుపాయలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.ముఖ్యమంత్రి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:40 గంటలవరకు మెదక్ పర్యటన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, అధికారుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.