*రాష్ట్ర ముఖ్య మంత్రి పర్యటన సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లను పరిశీలించిన మల్టీ జోన్ I ఐజి చంద్ర శేఖర్ రెడ్డి జిల్లా ఉదయ్ కుమార్ రెడ్డి*

*రాష్ట్ర ముఖ్య మంత్రి పర్యటన సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లను పరిశీలించిన మల్టీ జోన్ I ఐజి చంద్ర శేఖర్ రెడ్డి జిల్లా ఉదయ్ కుమార్ రెడ్డి*

జిల్లా కు విచ్చేస్తున్న ప్రముఖుల పర్యటనకు, క్రిస్మస్ వేడుకలకు 1000 మందితో పటిష్టమైన బందోబస్తు విధులు.

క్రిస్మస్ జాతర పై కమాండ్ కంట్రోల్ సి.సి. కెమెరాల ద్వారా నిఘా.

సమాచారం కోసం ప్రత్యేక పోలిస్ కంట్రోల్ రూమ్.

జిల్లా ఎస్పి ఉదయ్ కుమార్ రెడ్డి.

తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 24:

ఈ నెల 25 వ తేదీన మెదక్ జిల్లా ఎడపాయల ప్రపంచ ప్రసిద్ది సి.ఎస్.ఐ. చర్చ్ అభివృద్ది కార్యక్రమాలలో భాగంగా విచ్చేస్తున్న రాష్ట్ర గౌరవ ముఖ్య మంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా మల్టీ జోన్ I ఐజి చంద్ర శేఖర్ రెడ్డి పరిశీలించి రాష్ట్ర గౌరవ ముఖ్య మంత్రివర్యులు రేవంత్ రెడ్డి గార్ల పర్యటన కోసం తీసుకోవాల్సిన పటిష్ట బందోబస్త్ చర్యలపై పోలీస్ అధికారులకు,సిబ్బందికి పలు సూచనలు చేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి గారు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన మెదక్ జిల్లా ఎడపాయల ప్రపంచ ప్రసిద్ది సి.ఎస్.ఐ. చర్చ్ అభివృద్ది కార్యక్రమాలలో భాగంగా విచ్చేస్తున్న రాష్ట్ర గౌరవ ముఖ్య మంత్రివర్యులు శరేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్నీ జాగ్రత్త చర్యలు తీసుకున్నామని అదేవిదంగా వాహనాల పార్కింగ్ గురించి, ట్రాఫిక్ నియంత్రణ గురించి పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర గౌరవ ముఖ్య మంత్రివర్యులు రేవంత్ రెడ్డి మొదటగా ఎడపాయల వన దుర్గా అమ్మవారిని దర్శించుకుని అక్కడ చేపట్టబోయే అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి అక్కడి నుండి ఆసియా ఖండం లోనే అతి పెద్దదైన క్రైస్తవ దేవాలయానికి విచ్చేసి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం అక్కడ చేపట్టబోయే అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి అక్కడి నుండి జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయానికి వచ్చి ఇక్కడి నుండి హైదరాబాద్ కి వెళ్లనున్న నేపద్యంలో ఎలాంటి అవాచనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బందిని సెక్టార్ లుగా ఏర్పాటు చేసి జిల్లా ఎస్.పి. గారి పర్యవేక్షణలో దాదాపు 1000 మందితో పటిష్టమైన బందోబస్తు విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ బందోబస్త్ ను కమాండ్ కంట్రోల్ సి.సి. కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశామన్నారు. జాతరకు వచ్చే భక్తులు తమ యొక్క వాహనాలను ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేయకుండా పార్కింగ్ కోసం కేటాయించిన స్థలాల్లోనే తమ వాహనాలను నిలుపుకోవాలని తెలిపినారు. తమ వెంట తీసుకోని వచ్చే వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని, అపరిచితులను నమ్మి తమ యొక్క వస్తువులను ఇవ్వరాదని అన్నారు. జాతరలో ఎవరైనా చిన్న పిల్లలు తప్పిపోయినట్లయితే చర్చ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలిస్ కంట్రోల్ రూమ్ లో వారి వివరాలు తెలిపాలని, అనుమానితంగా వుండే వస్తువులు, వ్యక్తులు పరిసర ప్రాంతాల్లో కనిపిస్తే వెంటనే పోలిస్ కంట్రోల్ రూమ్ లో తెలపాలని అన్నారు. జాతరలో భద్రతలో భాగంగా బి.డి.టీం, డాగ్ స్వాడ్ లను ఏర్పాటు చేయడం జరిగినదని, భద్రతలో విషయంలో ఎలాంటి రాజీపడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని, భద్రత విషయంలో ప్రజలు పోలిసు వారికి సహకరించాలని కోరారు. క్రిస్మస్ వేడుకలకు చర్చి సందర్శించే భక్తులు సుఖ సంతోషాలతో పండుగను జరుపుకోవాలని, సామాజిక దూరం పాటించాలని, జిల్లా ప్రజలకు ఎస్పి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపినారు.
ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా మరియు నిజామాబాద్, కామారెడ్డి,సిద్దిపేట కరీంనగర్, రామగుండం, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిర్మల్ జిల్లాల సిబ్బంది ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment