భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

దేశానికి చేసిన సేవలు మరువలేనివి టిపిసిసి కార్యదర్శి చౌదరి సుప్రభాత్ రావు అన్నారు.

తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 27:

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడం దేశ ప్రజలకు తీరని లోటని టి పి సి సి కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు అన్నారు. శుక్రవారం మెదక్ చౌరస్తా వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా పది సంవత్సరాలు గా కొనసాగి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా లేచాడని ఆయన అన్నారు. చిరస్థాయిగా దేశ ప్రజల గుండెల్లో నిలిచే విధంగా మన్మోహన్ సింగ్ నిలిచాడని ఆయన పేర్కొన్నారు. పది సంవత్సరాల్లో ఏనాడూ దేశ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేశాన్ని కాపాడిన ఏకైక మహానుభావుడు మన్మోహన్ సింగ్ అని ఆయన అన్నారు. మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏసు గారి రమేష్ రెడ్డి, మాజీ మాజీ పట్టణ అధ్యక్షుడు డాకి స్వామి, మాజీ లక్ష్మాపూర్ ఎంపీటీసీ సభ్యులు మల్లన్న గారి నాగులు, రవీందర్, ఉద్యమాల ముద్దుబిడ్డ మహిళ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పోచమ్మల అశ్విని శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు సురేష్ నాయక్, గుల్పర్తి యాదగిరి, పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటేశం, దేమే యాదగిరి, చెప్పెట ముత్యంరెడ్డి,అక్కన్నపేట కుమార్ యుగంధర్ రావు, ఇసుక ప్రకాష్, శివ ప్రసాద్ ముదిరాజ్, చింతల స్వామి, మాజీ కౌన్సిలర్ నెహ్రూ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment