డైరెక్టర్ ఎన్ శంకర్ కి ఘనంగా స్వాగతం పలికిన దూం దాం కళాకారుడు అంతడుపుల నాగరాజు కళాకారుల బృందం

డైరెక్టర్ ఎన్ శంకర్ కి ఘనంగా స్వాగతం పలికిన దూం దాం కళాకారుడు అంతడుపుల నాగరాజు కళాకారుల బృందం

తెలంగాణ కెరటం, డిసెంబర్ మందమర్రి

సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతం సాంస్కృతిక చైతన్యానికి ప్రతీక అని సౌత్ ఇండియా డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రముఖ సినీ దర్శకుడు ఎన్. శంకర్ అన్నారు. మందమర్రి పట్టణంలోని దర్గాని దర్శించుకునేందుకు తన కుమారుడితో వచ్చిన ఎన్. శంకర్ కు తెలంగాణ ధూమ్ ధామ్ వ్యవస్థాపకుడు అంతడుపుల నాగరాజు స్థానిక కళాకారులు శుక్రవారం ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా కేకే – 2 ప్రాంతంలో గల దర్గా ని సందర్శించుకుని ప్రార్థనలు జరిపారు. అనంతరం గపూర్ బాబా పీర్లను దర్శించుకుని దట్టీలు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈసందర్భంగా గపూర్ బాబా ప్రతేక ప్రార్థనలు జరిపి వీరిని ఆశీర్వదించారు. అనంతరం స్థానిక కళాకారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణలోని కోల్ బెల్ట్ ప్రాంతం సబ్బండ వర్గాలకు నిలయమని ఈ నేల ఎన్నో పోరాటలకు స్ఫూర్తినిచ్చిందన్నారు. కవులకు, రచయితలకు కళకారులకు ఈ ప్రాంతం పెట్టిన పేరని అన్నారు. జై బోలో తెలంగాణ సినిమా పాట చిత్రీకరణలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే పీరీల పండుగలకు సంబందించి గపూర్ బాబా పీర్లను వాడుకోవడం జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని మతాల దేవుళ్ళ అశీషులు కోరినట్లు చెప్పారు. అప్పుడు మొక్కిన మొక్కును ఇప్పుడు చెల్లించుకునేందుకు ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. త్వరలోనే తెలంగాణ (డెక్కన్ ప్రాంతం) ఔన్నత్యాన్ని నాటి నిజాం నవాబుల కాలం నుండి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు జరిగిన చరిత్రను అందరికీ తెలిసేలా వెబ్ సిరీస్ కు రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ సాంస్కృతిక విప్లవం తీసుకొచ్చిన మందమర్రి కళకారుడు అంతడుపుల నాగరాజుకు బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నైనా అతనికి సముచిత స్థానం లభిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో సీనియర్ కళాకారులు సాధనవేణి ప్రభాకర్, లయోల కుమార్, సాదుల సాంబయ్య, ముల్కళ్ల శంకర్, ఎగ్గేటి రాజేశ్వర్ రావు, ఉప్పులేటి నరేష్, బియ్యాల ఉపేందర్, ఉప్పులేటి రాజమౌళి, హనుమాండ్ల మధుకర్, రాకం సంతోష్, కొండపర్తి సది, ఎర్రవేని రమేష్ యాదవ్, క్రేజీ విజయ్, ఏ.రాజు, పోలు సంపత్, నీలాల శ్రీనివాస్, ఉడుత సాగర్, అర్.కే సంపత్, అడ్డగురి లక్ష్మణ్, వేల్పుల రమేష్, అడ్లూరి గిరి స్థానికులు గట్ల సారంగపాణి, రాయబారపు జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment