అయ్యప్పస్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి.
తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 28:
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో శనివారం అయ్యప్ప స్వాములు నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు,పడిపూజలో పాల్గొన్న ఎమ్మెల్సీని అయ్యప్ప స్వాములు శాలువాతో ఘనంగా సన్మానం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ స్వామి వారి కృపతో అందరూ పాడిపంట,సుఖశాంతులతో ఉండాలని ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి వారిని కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గారి వెంట సర్పంచులు మహిపాల్ రెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గోపాలరావు,శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.