రిటైర్ ఉద్యోగిని సన్మానించిన డాక్టర్ అనురాధ.
తెలంగాణ కెరటం అచ్చంపేట (డిసెంబర్ 29):
అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలం పోలిశెట్టి పల్లి గ్రామానికి చెందిన నాగటి రామస్వామి లింగాల సిపిఎస్ పాఠశాలలో ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయులుగా నిర్వహించి ఆదివారం రిటైర్మెంట్ ఆయన సందర్భంగా అచ్చంపేట పట్టణంలోని బికే ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన రిటైర్మెంట్ ఫంక్షన్ కు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సతీమణి సిబిఎం ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ అనురాధ ముఖ్య అతిథిగా హాజరై రిటైర్ ఉద్యోగి రామస్వామిని సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనురాధ మాట్లాడుతూ ప్రభుత్వ కొలువులో ప్రతి ఉద్యోగికి ఉద్యోగ విరమణ తప్పదని రిటైర్మెంట్ జీవితాన్ని సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగి రామస్వామి దంపతులు, సహచర ఉద్యోగులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.