గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు .
మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సాకారంతో అత్యాధునిక లైబ్రరీనీ త్వరలో ప్రారంభం .
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్ 30
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండల మున్సిపల్ వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి
ఈరోజు హుజూర్నగర్ టౌన్ హాల్లో లైబ్రరీలో చదువుకొని ఉద్యోగాలు పొందినటువంటి ఉద్యోగస్తులని సూర్యాపేట జిల్లా గ్రంధాలయ అధ్యక్షులు వంగవీటి రామారావు గారు, వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మల్లికార్జున్ తో కలిసి సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులాగా కాకుండా ప్రస్తుత గవర్నమెంటులో క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇవ్వడమే కాకుండా వాటిని సంబంధించిన ఉద్యోగ నియామకాలు కూడా పూర్తి చేయడం జరుగుతుందని, దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తూ వాటిని పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని, రాబోయే రోజుల్లో నిరుద్యోగుల కోసం మరిన్ని నోటిఫికేషన్లు ఇవ్వనున్నామని, ఉద్యోగులు నిత్యం చదువుతూ ఉద్యోగాలు పట్టుదలతో సాధించాలని, హుజూర్నగర్ లో సరికొత్త హంగులతో పూర్తి కావస్తున్న కొత్త గ్రంధాలయం త్వరలోనే చిన్న చిన్న పనులు పూర్తిచేసుకుని అక్కడకు గ్రంథాలయమును ప్రారంభించబోతున్నట్లు, ఈ సందర్భంగా వివిధ జాబు నోటిఫికేషన్ ల లో ఉద్యోగాలు సాధించినటువంటి 22 మంది ఉద్యోగులను ఆయన శాలువాలతో సన్మానించి వారిని అభినందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ శ్రీధర్ రెడ్డి, లైబ్రరీ విద్యార్థులు పాఠకులు పాల్గొన్నారు.