నూతన సంవత్సర వేడుకల పేరుతో తోటి పౌరులకు అసౌకర్యం కలిగే విధంగా ప్రవర్తిస్తూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు .
గోపి కృష్ణ ఎస్ ఐ పెన్ పహాడ్ .
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్
సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పోలీసు శాఖ తరుపున పౌరులందరికి, ముందస్తు నూతన సంవత్సర హార్దిక శుభాకాంక్షలు .
న్యూ ఇయర్ సందర్భంగా ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకొని క్రింది సూచనలను పాటించవల్సిందిగా విజ్ఞప్తి.
నూతన సంవత్సర వేడుకలు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీస్ శాఖ ప్రజలందరికీ ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నది. నూతన సంవత్సరం మొదటి రోజు ఏ కుటుంబం కూడా విషాదకర ఘటనతో ఆరంభం కాకుండా (ఒకసారి పాత వార్తలను చూడండి) అన్ని జాగ్రతలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అని మండల ఎస్ ఐ గారు అన్నారు .