ఏకీకృత పెన్షన్ మా కొద్దు.
సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ.
తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్
మెదక్ జిల్లా కేంద్రంలో పాపన్న పేట్ మండలంలో పోడిషన్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ గార్ల చే యూపీఎస్ విధానం వద్దు అనే కర పత్రం ఆవిష్కరణ జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ ఇటీవల కేంద్ర మంత్రి వర్గం యూపీఎస్ విధానం ను ఆమోదం తెలపిందని, ఏప్రిల్ 1 2025 నుండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు అమలు చేయనున్న ఏకీకృత పెన్షన్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. ఏకీకృత పెన్షన్ విధానం అనేది కేవలం ఉద్యోగులనుమోసగించి,కార్పొరేట్ల కడుపు నింపడానికి వచ్చింది తప్ప ఉద్యోగి కుటుంబానికి సామాజిక భద్రత చేకూర్చే పథకం కాదని దీన్ని తీవ్రంగా ప్రతిఘటించాల్సిన సమయం ఆసన్నమైనదని స్థిత ప్రజ్ఞ తెలిపారు. సంఘ సభ్యత్వ నమోదుప్రారంభించారు.అందరూ ఉద్యోగ ఉపాద్యాయులు హాజరుకావాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి చంద్రం, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రమేష్,సాజిద్, తదితరులు పాల్గొన్నారు.