తపస్ 2025 క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్ బాదావత్ సంతోష్.

తపస్ 2025 క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్ బాదావత్ సంతోష్.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి డిసెంబర్

జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తన ఛాంబర్ లో సోమవారం సాయంత్రం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు రానున్న పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత ప్రమాణాలు పాటించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు.తపస్ జిల్లా అధ్యక్షులు దెంది రాజారెడ్డి మాట్లాడుతూ
ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యాను అందించేందుకు ఉపాధ్యాయుల కృషి చేస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్, తపస్ జిల్లా అధ్యక్షులు దెంది రాజారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మనమోని శేఖర్ ,తపస్ రాష్ట్ర, జిల్లా బాధ్యులు, మండల శాఖ బాధ్యులు, తపస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment