ఈనెల 9న శ్రీ మామిళ్ళపల్లి లక్ష్మీనరసింహ స్వామి పాలకమండలి ప్రమాణ స్వీకారం.

ఈనెల 9న శ్రీ మామిళ్ళపల్లి లక్ష్మీనరసింహ స్వామి పాలకమండలి ప్రమాణ స్వీకారం.

 

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (జనవరి 1):

 

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండలం మండలం మామిళ్ళపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పాలకమండలి

చైర్మన్ మరియు పాలక మండల సభ్యుల ప్రమాణ స్వీకారం మహోత్సవం.ఈనెల 9 వ తేదీన ఉదయం 11:00లకు పాలకమండలి చైర్మన్ మరియు పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకారం ఉంటుంది

కావున నాయకులు కార్యకర్తలు అభిమానులు భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూఅతి ప్రాచీన పురాతనమైన దేవాలయాల్లో శ్రీ మామిళ్ళపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని,

మామిళ్ళపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధికి జిల్లాలో ఎమ్మెల్యేలు ఎంపీ మంత్రుల సహకారంతో దేవాలయం అభివృద్ధి చేయడానికి తమ వంతుగా కృషి చేస్తామని అన్నారు. రానున్న రోజుల్లో లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అన్ని రకాల వసతులు సదుపాయాలతో కూడిన దేవాలయంగా తీర్చిదిద్దాము దేవాలయం కింద పరిధిలో ఉన్నటువంటి భూములను గత ప్రభుత్వ పాలకులు అక్రమంగా పట్టాలు చేశారు వాటిని స్వాధీనం చేసుకొని దేవాలయ భూములను పకడిబందిగా రక్షిస్తాం యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవంలో అందరు పాల్గొన విజయవంతం చేయాలని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment