ప్రమాద రహిత డ్రైవింగ్ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ప్రమాద రహిత డ్రైవింగ్ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

తెలంగాణ కెరటం ఘట్ కేసర్ ప్రతినిధి  జనవరి

పరధ్యానం లేకుండా విధులు నిర్వర్తించినప్పుడే ప్రమాద రహిత డ్రైవింగ్ సాధ్యమవుతుందని ఆర్టీసీ చెంగిచెర్ల డిపో మేనేజర్ కే కవిత తెలిపారు. ఆర్టీసీ చెంగిచెర్ల డిపోలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల కార్యక్రమాన్ని ఘట్ కేసర్ ట్రాఫిక్ ఎస్ఐ మల్లయ్య తో కలిసి గురువారం ఆమే ప్రారంభించారు. డ్రైవర్ లు ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ద్వారానే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ డ్రైవింగ్ చేస్తే ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. ట్రాఫిక్ ఎస్ఐ మల్లయ్య మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ద్వారా ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందని తెలిపారు. డ్రైవింగ్ చేసే ముందు అలసటకు గురి కాకుండా మానసిక ప్రశాంతతతో విధులు నిర్వర్తిస్తే ప్రమాదాలను నివరించవచ్చన్నారు. డ్రైవింగ్ చేసే పనిపై పూర్తి శ్రద్ధ ఉంటే ప్రమాద రహిత డ్రైవర్లుగా గుర్తింపును పొందుతారన్నారు. బస్సును నిలిపేటప్పుడు బస్సు బే లోనే ఆపాలన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ను దాటేయాలని ఆత్రుతతో చాలామంది ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పారు. మనం, మన కుటుంబ సభ్యులు క్షేమంగా రోడ్డుపై వెళ్లేవారు సురక్షితంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ విధులను కర్తవ్య దిక్షతో నిర్వర్తించాలని సూచించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్) సాయి సుబ్రహ్మణ్యం, సూపరిండెంట్ ట్రాఫిక్ వెంకటేశ్వర్లు డిప్యూటీ సూపరిండెంట్ అరుణ లక్ష్మి, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ అక్బర్, లైసెనింగ్ ఆఫీసర్ కృష్ణ, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ లు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment