ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధo

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధo

తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జనవరి

భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరామ్ ఆధ్వర్యంలో నాంపల్లి బిజెపి రాష్ట్ర కార్యాలయం పై కాంగ్రెస్ పార్టీ ఎన్ ఎస్ యు ఐ గుండాల దాడికి నిరసనగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు జాయినపల్లి శ్యాంసుందర్ రెడ్డి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్త మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్ ఎస్ యు ఐ కార్యకర్తలు తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యాలయం పై దాడి చేయడం సిగ్గుచేటు అని తెలంగాణలో అధికారంలోకి వచ్చి ప్రజలకు హామీలు ఇచ్చి నెరవేర్చకపోగా వీధి రౌడీల్లాగా వ్యవహరిస్తు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రోజుకొక మాట వేశం వేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా ఖబర్దార్ ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఊరుకోరని మేము జాతీయస్థాయిలో అధికారంలో ఉన్నామని మీరు కేవలం కొన్ని రాష్ట్రాలకే పరిమితమై ప్రాంతీయ పార్టీ హోదా కూడా లేకుండా ఉన్నారని అన్నారు
ఈ సందర్భంగా పాల్గొన్నవారు మునిసిపల్ వైస్ చైర్మన్ మాయ దశరథ, పదరాజు ఉమా శంకర్ రావు, కౌన్సిలర్ లు ఉదయగిరి విజయ్ కుమార్, ఉదరి లక్ష్మీ సతీష్, జనగాం కవిత నరసింహచారి, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు పట్నం కపిల్, నీలం రమేష్, పట్టణ ప్రధాన కార్యదరర్షులు రాళ్లబండి కృష్ణచారి, రత్నపురం శ్రీశైలం, ఎంగిలి లక్ష్మణ్ ,యాట వెంకట్, ఎదగని సంతోష్, గౌటి రాజేష్,మంగు నరసింహారావు, కానుకుంట్ల రమేష్ దాసరి స్వామి, ఉషా కిరణ్, కొలిచెలిమా మల్లికార్జున్,గీస కొండల్, ఎర్రబెల్లి నాగరాజు, తుమ్మల నాగేష్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment