జువ్వాడి కృష్ణారావు ఆధ్వర్యంలో లాల్ బహుద్దూర్ శాస్త్రి వర్ధంతి వేడుకలు 

జువ్వాడి కృష్ణారావు ఆధ్వర్యంలో లాల్ బహుద్దూర్ శాస్త్రి వర్ధంతి వేడుకలు 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, జనవరి 11 : కోరుట్ల పట్టణంలోని జువ్వాడి భవన్ లో శనివారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి దివంగత లాల్ బహుద్దూర్ శాస్త్రి వర్ధంతి వేడుకలు నిర్వహించారు. శాస్త్రి జీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ జై జవాన్..జై కిసాన్ అని నినదించి, నీతివంతమైన పాలన అందించిన గొప్ప వ్యక్తి లాల్ బహుద్దూర్ శాస్త్రి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ఎంబేరి నాగభూషణం, పుప్పాల ప్రభాకర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి రాజోజు సదానందాచారీ, నాయకులు ఏఆర్ అక్బర్, ముల్కప్రసాద్, రియాజ్, న్యామతాబాద్ రాకేష్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment