మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి జనవరి 11:
మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం ముత్తాయిపల్లి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకుడు రెడ్డిగారి గోపాల్ రెడ్డి తల్లి లక్ష్మి నర్సమ్మ మరణించిన విషయం తెలుసుకున్న మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఈ రోజు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరమార్శించడం జరిగింది. వారి వెంట హవేలీ ఘనపూర్ మండల్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మెదక్ మున్సిపల్ కౌన్సిలర్లు భీమరి కిషోర్,మామిళ్ల ఆంజనేయులు,ఫరీద్ పూర్ సొసైటీ చైర్మన్ బ్రహ్మం, బీబీపూర్ మాజీ ఎంపీటీసీ రాజు’ మెదక్ మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు కిష్టయ్య ‘ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు సతీష్ రావు ‘ మేకల సాయిలు ,రామచంద్రారెడ్డి లింగారెడ్డి’ రాజేశ్వరరావు ‘ సాప సాయిలు తదితరులు ఉన్నారు.