సహజ వనరులను రక్షించడం,సంరక్షించడం మన బాధ్యత
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ ప్రతినిధి జనవరి 16,
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని ఎర్రవల్లిలో గల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ మనవడు హిమాన్షు రావు తన తాత సూచనలతో హిమాన్షు తానే స్వయంగా పారతో మట్టి తీసి చెట్టును నాటాడు.గురువారం నాడు కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో చెట్టు నాటుతూ చెట్టు చుట్టూ ఎరువు పోసి,చెట్టు చుట్టూ మట్టిని చదును చేశాడు.అలా చేసిన వీడియోను హిమాన్షు తన ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేసి యువతకు ఒక సందేశం ఇచ్చాడు.ఉత్తముల నుండి నేర్చుకోవడం అనేది గొప్ప విషయం అని అన్నారు.వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి చెట్లను నాటడం,అడవులను పెంచడం చాలా అవసరమని వారు అన్నారు.మన సహజ వనరులను రక్షించడం,సంరక్షించడం మన బాధ్యత అని హిమాన్షురావు యువతకు మంచి మెసేజ్ ఇచ్చారు.