ప్రభుత్వ ఉద్యోగులందరికీ బదిలీలు సాధారణం.
నూతన అదనపు కలెక్టర్ స్వాగతం బదిలిపై వెళ్ళిన అదనపు కలెక్టర్ ఆత్మీయ వీడ్కోలు సమావేశం.
బదిలీపై వెళ్తున్న అదనపు కలెక్టర్ కే సీతారామారావుకు ఘనంగా సన్మానం.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి జనవరి
ప్రభుత్వ ఉద్యోగులందరికీ బదిలీలు సాధారణ నూతన అదనపు కలెక్టర్‌కు స్వాగతం పలుకుతూ గురువారం బదిలీపై వెళుతున్న అదనపు కలెక్టర్‌కు ఆత్మీయ వీడ్కోలు పలికారు జిల్లా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది.
కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మానం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి బదిలీలు సర్వసాధారణమని ఈ విషయంలో వారు ఏ ప్రాంతానికి బదిలీపై వెళ్ళినా తమకంటూ ఒక గుర్తింపును, మంచి పేరు సంపాదించుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకాంక్షించారు నాగర్ కర్నూల్ జిల్లా (రెవిన్యూ) అదనపు కలెక్టర్‌గా పనిచేసి బదిలీపై వెళ్తున్న కే సీతారామారావు జిల్లాకు విశిష్ట సేవలు అందించారని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు.
అదనపు కలెక్టర్‌గా కే. సీతారామారావు జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో జిల్లాలో అనేక ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ పకడ్బందీగా చేపట్టారని, జిల్లాలో ప్రజా ప్రయోజన కార్యక్రమాలలో జిల్లా అధికార యంత్రాంగంతో మమేకమై పని చేశారని అన్నారు. జిల్లా అభివృద్ధి, రెవిన్యూ అంశాలు ధరణి వంటి ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేశారని, ఆయన సేవలపై కలెక్టర్ ఈ సందర్భంగా కొనియాడారు. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలలో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో అహర్నిశలు విశేష కృషి చేశారని అన్నారు.
ఈ సందర్భంగా కే సీతారామారావు మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహించినందుకు సంతోషంగా ఉందని, విధి నిర్వహణలో సహకరించిన జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో తాను పని చేసిన సమయంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఎంతో సహకరించారని వారి సహకారం ఎప్పటికీ మరువలేనిదని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ధరణి, శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలలో, అనేక విషయాల్లో అధికారులు ఎప్పటికప్పుడు పనులను పూర్తి చేసి ఏమాత్రం పెండింగ్ లేకుండా చేయడంలో వారి పాత్ర ఎంతో ఉందని తెలిపారు. అలాగే జిల్లా స్థాయి అధికారులతో పాటు కింది స్థాయి అధికారులు, సిబ్బంది చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని సమావేశంలో వివరించారు. ఆత్మీయ సన్మానం కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్లు దేవసహాయం,అమరేందర్,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అరుణా రెడ్డి,యాదగిరి, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్ ,జిల్లా అధికారులు రమేష్,రామ్‌లాల్, ఖాజా అలీ అఫ్సర్, ఫిరంగి,రజినీ,నరేందర్ రెడ్డి, రామ్మోహన్రావు ,సీతారాం నాయక్,శ్రీనివాసులు, స్వరాజ్య లక్ష్మి ఆర్డీవో లు, తహసీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లు ,కలెక్టరేట్ సిబ్బంది తదితరులు బదిలీపై వెళ్తున్న అదనపు కలెక్టర్ కే సీతారామారావు కు శాలువాలు, పుష్పగుచ్చాలతో సత్కరించారు.