బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం
తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ ప్రతినిధి జనవరి
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బంగ్ల వెంకటాపూర్ గ్రామంలో దర్శనం నాగమణి నర్సింలు కుటుంబంలో నాగమణి జాండీస్ వచ్చి వారం రోజుల క్రితం చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది.తండ్రి నర్సింలు మతిస్థిమితం కోల్పోయి ఉన్నారు.వారికి సంతానం ముగ్గురు పిల్లలు పెద్ద పిల్లవాడు మూడో తరగతి,రెండో పిల్లవాడు ఒకటో తరగతి,చివరి పిల్లవాడు అంగన్వాడి స్కూల్ కు పోతున్నారు.కుటుంబాన్ని పోషించలేక ఆకలి చావులతో నాగమణి గత వారం రోజుల క్రితం చనిపోయింది.ఆదుకునే వాళ్ళు ఎవరూ లేక కుటుంబం రోడ్డు మీద పడిందని పేపర్ స్టేట్మెంట్ చూసి డాక్టర్ ఆనంద్ ప్రోగ్రాం ఆఫీసర్ కుమార్తె శ్రీజానంద్ పేరు మీద వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక క్వింటల్ బియ్యము సహాయంగా అందించారు.డాక్టర్ ఆనంద్ కుమార్తె శ్రీజానంద్ (19) సంవత్సరాలు,ఎంబిబిఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు.డెంగ్యూ ఫీవర్ అనారోగ్యంతో యశోద హాస్పిటల్ ఐసియు లో హైదరాబాద్ నందు చికిత్స పొందుతున్నారు.తొందరగా కోలుకోవాలని భగవంతుని కోరుకుంటున్నాను.ఈ కార్యక్రమంలో దేవసాని వాసుదేవ్,ఆశా వర్కర్ కమల,అంగన్వాడీ లు బాకీ,భాగ్యశ్రీ ఉన్నారు.అలాగే దేవసాని హనుమాన్ దాస్ తనవంతు సహాయంగా 500 రూపాయలు ఆర్థిక సాయం అందించారు.