క్రికెట్ రంగంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఖ్యాతిని చాటే విధంగా మీ ప్రతిభను చూపండి..

*క్రికెట్ రంగంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఖ్యాతిని చాటే విధంగా మీ ప్రతిభను చూపండి.

మంత్రి పొంగులేటి కార్యాలయ ఇంఛార్జి తుంబూరు దయాకర్ రెడ్డి., డాక్టర్ పరుచూరి..

  1. *👉 ముఖ్య అతిథులకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికిన నిర్వాహకులు మహమ్మద్, మతీన్.*
    ఖమ్మం ఫిబ్రవరి 18.:::*
    క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర సౌష్టవానికి ఉపయోగ పడతాయని, ఆయా విభాగ క్రీడా స్థాయి గుర్తిoపు ద్రువపత్రాలు సర్కారీ కొలువులకు కొలమానం అవుతాయని మంత్రి పొంగులేటి కార్యాలయ ఇంఛార్జి తుంబూరు దయాకర్ రెడ్డి అన్నారు.. మంగళవారం ఖమ్మం సర్థార్ పటేల్ స్టేడియంలో రాజీవ్ గాంధీ మెమోరియల్ 17 వ ట్రోఫీ టోర్నమెంట్ ను దయాకర్ రెడ్డి, ప్రముఖ వైద్యులు పరుచూరి వెంకటేశ్వరరావు, డివై ఎస్ వో. సునీల్ రెడ్డి ప్రారంభించారు.
    ఈసందర్భంగా తుంబూరు దయాకర్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడా అభివృద్ధికోసం తమ ప్రభుత్వం పాటు పడుతుందని అన్నారు..
    అనంతరం ప్రముఖ వైద్యులు డాక్టర్ పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. యువత క్రీడల్లో రాణిస్తూ వారి తల్లిదండ్రులకు తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకు రావాలని, క్రీడల్లో గాయాలు కాకుండా జాగ్రత్తలు పాటిస్తూ క్రీడాస్పూర్తితో ఆడాలని ఆయన ఆకాంక్షించారు..
    ఉదయం జరిగిన మ్యాచ్ లలో భాగంగా ముదిగొండ, ఏన్కూరు జట్ల మ్యాచ్ ను ప్రముఖ వైద్యులు డాక్టర్ పరుచూరి ప్రారంభించగా, మధ్యాహ్నం జరిగిన మ్యాచ్ తల్లాడ, జూలూరుపాడు జట్ల మ్యాచ్ ను తుంబూరు దయాకర్ రెడ్డి ప్రారంభించారు.
    తొలుత ముఖ్యఅతిథులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు మహమ్మద్ మతీన్, జర్నలిస్ట్ జానిపాషా, సీనియర్ క్రీడాకారిణి అంజలిలు, జూనియర్ అసిస్టెంట్ నాగమణి, పుష్పగుచ్ఛo అందజేసి స్వాగతం పలికారు.
    గెలుపొందిన విజేతలకు రూలింగ్ ట్రోఫీని బాబురావు జ్ఞాపకార్ధంగా బహుమతులు అందజేయ బడుతుందని మతీన్ పేర్కొన్నారు..
    తెలoగాణ జిల్లాల క్రికెట్ అసోసియేషన్ సౌజన్యంతో జరిగే టోర్నమెంట్ కు నిర్వాహకులు మహమ్మద్ మతీన్, ను వారు ప్రత్యేకంగా అభినందించారు.

ఈమేరకు నిర్వాహకులు మతీన్ ముఖ్య అతిథులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.. ఈకార్యక్రమంలో క్రీడాకారులు సురేష్, సిద్దు, నాగేశ్వరరావు, క్రిస్త ఫర్, గౌస్, యువ ఏంపైర్లు తదితరులు పాల్గొన్నారు..

*క్రీడా పోటీల వివరాలు..*

*ఏన్కూరు పై ముదిగొండ గెలుపు..*

టాస్ గెలిచిన ఏన్కూరు టీమ్ బౌలింగ్ ఎంచుకోగా.. ముదిగొండ బ్యాట్ మన్ లు 15 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేశారు. బెస్ట్ బ్యాట్స్మన్ గా నిలిచిన పవన్ 43 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 68 పురుగులు చేశారు. .ఏన్కూరు బౌలర్ 3 ఓవర్లలో 7 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నారు.

*జూలూరుపాడుపై తల్లాడ గెలుపు.*

టాస్ గెలిచిన తల్లాడ టీమ్ మొదట బ్యాటింగ్ చేసి 16 ఓవర్లలో 121 పరుగులు చేశారు.. తరువాత బ్యాటింగ్ చేసిన జూలూరుపాడు టీమ్ 16 ఓవర్లలో 100 పరుగులు చేసి ఓటమిని పాలయ్యారు.

*81 బంతుల్లో 136 పరుగుల ధీరుడు.*
*కల్లూరు టిం ఖమ్మం రూరల్ జట్లు తలపడగా కల్లూరు టిం లో క్రీడాకారుడు SK జానిమియా (బబ్లూ) మొదటి మ్యాచ్ లో 81 బంతులలో 136 పరుగులు చేసి మ్యాచ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు..*

Join WhatsApp

Join Now

Leave a Comment