మల్లికార్జున స్వామి జాతరకు మర్కుక్ ఎస్ఐ కి ఆహ్వానం
-తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ ప్రతినిధి ఫిబ్రవరి 24,
మర్కుక్ మండల పరిధిలోని నర్సన్నపేట గ్రామ శివారులో గల శ్రీ మల్లికార్జున స్వామి జాతర సందర్భంగా మర్కుక్ మండల ఎస్ఐ ఓ.దామోదర్ ను జాతరకు హాజరు కావాలని నర్సన్నపేట గ్రామస్తులు కలిసి ఆహ్వానించారు.ఎస్ఐ దామోదర్ గ్రామస్తుల ఆహ్వానమేరకు జాతరకు వచ్చి,శ్రీ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటానని వారితో అన్నారు.ఈ కార్యక్రమంలో నిరుగంటి బాలమల్లు,ఎంబరి వెంకటేశం,బుకల భిక్షపతి,బుకల బాలమల్లు,చెకటి యాదగిరి తదితరులు ఉన్నారు.