ఇద్దరు స్నేహితులు అనుమానస్పదంగా మృతి..

ఇద్దరు స్నేహితులు అనుమానస్పదంగా మృతి..

 

తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో నర్సాపూర్ క్రైమ్ న్యూస్ (ఫిబ్రవరి 25): అనుమానాస్పదంగా ఇద్దరు స్నేహితులు చెరువులో పడి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.., నర్సాపూర్ పట్టణానికి చెందిన దుర్గాప్పగారి సునీల్ గౌడ్, సారా ప్రవీణ్ కుమార్ ఇద్దరు స్నేహితులు వీరు మంగళవారం సాయంత్రం సమయంలో ఇంటి నుంచి బయలుదేరి స్థానిక రాయరావు చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ ఇద్దరు కలిసి మద్యం సేవించారు. రాత్రి అయినప్పటికీ వీరు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మంగళవారం దుర్గప్ప గారి సునీల్ గౌడ్, సార ప్రవీణ్ లు రాయరావ్ చెరువులో శవాలై తేలారు. ఈత కొట్టడానికి వెళ్లి మృతి చెందారా లేక ఒకరు కాలు జారి పడితే మరొకరు కాపాడడానికి వెళ్లి మృతి చెందారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ప్రవీణ్ కు భార్యతో పాటు కుమారుడు ఉన్నాడు. సునీల్ గౌడ్ కు ఇంకా వివాహం జరగలేదు. ఇదే విషయమై మంగళవారం వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దుర్గప్ప గారి సునీల్ గౌడ్ మనీ వ్యూ యాప్ లో సుమారు రెండు లక్షల వరకు లోన్ తీసుకున్నాడు. వారు నిత్యం వేధించడంతో వారి వేధింపులు భరించలేక మృతి చెంది ఉంటాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇద్దరు స్నేహితులు ఒకేసారి మరణించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. నర్సాపూర్ పట్టణంలో విషాదఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నర్సాపూర్ ఎస్సై లింగం తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment