రోమన్ లిపి ఉర్దూ భాషలో (అమ్మాపారా) ఖురాన్ విశ్లేషణ
రచయిత్రి డాక్టర్ అయేషా సుల్తానా
పుస్తక పరిచయం – ఒక సమీక్ష
- – ప్రీలాన్స్ జర్నలిస్ట్ యండి. షఫీ యు జమ
ఖమ్మం, మార్చి01 (తెలంగాణ కెరటం): తెలుగునాట కవయిత్రిగా, రచయిత్రిగా, సామాజిక కార్యకర్తగా, ఒక ఆంగ్లదినపత్రికలో అసిస్టెంట్ ఎడిటర్ గా జమాతే ఇస్లామి హింద్ కేంద్ర కమిటి సభ్యురాలిగా ప్రసిద్ధిగాంచిన డాక్టర్ అయేషా సుల్తానా ఇటీవల రోమన్ లిపి ఉర్దూ భాషలో విరచిత ‘ఫహం ఉల్ ఖురాన్’ పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకం విడుదల కాకముందే ఫ్రీ బుకింగ్ లో 500 కాపీలు అమ్ముడు పోయాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పుస్తకానికి విశేష ఆదరణ లభిస్తోంది. దివ్య ఖురాన్ అనేది అరబ్బీ భాషలో ఆవిర్భవించిన విషయం అందరికి తెలిసిందే.. కాగా ఈ పుస్తకం ఇతర భాషల వారికి అర్థం కావడానిక చాలా మంది ఖురాన్ ను అనువదించారు. ఇదే సమయంలో మరికొంతమంది దీనికి విశ్లేషణాత్మక రీతిలో రచించి పుస్తకానలు ముద్రించారు. ఈ కోవలోనే అయేషా సుల్తానా విశ్లేషణాత్మక పుస్తకమే ఈ ‘ఫహం ఉల్ ఖురాన్’ అనే పుస్తకం. మార్చి 2వ తేదీ నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో అయేషా సుల్తానా భావానువాద పుస్తకం వెలువడడం శుభసుచకం. నేటి కాలంలో చాలా మంది ముస్లింలు ఖురాన్ ను అర్థం చేసుకోవడంలో, దానిని ఆచరించడంలో వెనుకబడిపోవడానిక ప్రధాన కారణం ఆసక్తి లేకపోవడం… కాగా ఈ సమస్యను పరిష్కరించడానికి రోమన్ లిపిలో అనగా ఇంగ్లిష్ లిపి ఉర్దూ భాషలో అనగా ఉర్దూ శబ్ద ధ్వనిలో రూపొందిచిన ఈ పుస్తకం ప్రధాన లక్ష్యం అమ్మాపారా. అమ్మాపారా అనగా ఖురాన్ చివరి భాగం.. ఇందులో ఏకేశ్వరవాదం, పరలోక జీవితం, ప్రవక్త ధర్మం గురించి వివరంగా విశ్లేషించబడింది. ప్రధానంగా ఈ పుస్తకంలో పది అంశాలు ప్రాధాన్యతతో కూడి ఉన్నాయి. అందులో ముఖ్య అంశాలు
1. సురహ్ పేరు దాని అర్థం, 2. ఇది వెలువడిన సందర్భం, అప్పటి పరిస్థితులు., 3. ఏ సమయంలో అవతరించబడింది., 4. సారాంశం, మూలభావం. 5. ప్రాముఖ్యత, సంఘటనలు, సహబాల ఉల్లేఖనలు., 6. భావానువాదం., 7. ఈ సురహ్ నుంచి ఏం నేర్చుకోవాలి. 8. దైనందిన జీవితంలో ఎలాపాటించాలి. 9 ప్రశ్నలు సమాధానాలు. 10 ఆత్మ పరిశీలన కాగా ఈ పుస్తకం కొత్తతరహాలో రచించించడంతో దీనిని పాఠకులు సులభతరంగా అర్థం చేసుకోవడానికి వీలుపడుతుంది. డాక్టర్ ఆయేషా సుల్తానా విశేషణలు పైన పేర్కొన్నవి మాత్రమే కాకుండా ఆమె ఒక ఇస్లామిక్ పండితురాలు. కాబట్టి ఈ విధమైన పుస్తకరచన ఆమెకు సాధ్యపడింది.
రంజాన్ మాసం ప్రారంభం సమయంలోనే ఈ పుస్తకాన్ని తీసుకురావలనుకున్న ఆమె ఉద్దేశ్యం అంతవరకే పరిమితం కాకుండా ఈ పుస్తకాన్ని సులభమైన భాషలో ముఖ్యంగా ఆంగ్ల విద్యాభ్యాసం చేస్తున్నవారికి అర్థం కావడం అమ్మాపారా గురించి వివరణాత్మకంగా విశ్లేషణతో కూడి ఉండడం.., నేటి యువతకు ఇదెంతో ఉపయోగపడడం.., ఇస్లామియ్ జ్ఞాన సమూపార్జనకు ఇదెంతో తోడ్పాటునివ్వడం, పైగా జీవితంలో ఆచరించేందుకు వీలుకల్పించడం, అనే ఇతర ఆమె ఆలోచనలకు కూడా ఇది ఉపయోగపడింది. కాగా
జమాతే ఇస్లామి హింద్ డైరెక్టర్, ఆల్ ఇండియా మస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యురాలు, హదియా ఈ మ్యాగ్జిన్ చీఫ్ ఎడిటర్ అతియా సిద్ధిఖా ఈ పుస్తకానికి ముందుమాట రాస్తూ… ప్రపంచంలో గల అత్యుత్తమ భాషలలో అరబ్బిక్ భాష ఒకటి కాగా ఆ భాషలో తొలుత అవతరించిన ఖురాన్ ఇతర భాషలవారకి అర్థం చేసుకోవడానికి అనేక అనువాదాలు, విశ్లేషణల అవసరం ఏర్పడింది. ఈ రచయిత్రి డాక్టర్ అయేషా సుల్తానా పుస్తకం కూడా ఇలాంటి ప్రయత్నంలో ఒక భాగం. ఉర్దూ భాషను నేటి యువత అర్థం చేసుకోవడంలేదు. అదే విధంగా పూర్తిగా ఇంగ్లిష్ భాషలో కూడా ప్రావిణ్యత లేదు. ఈ నేపథ్యంలో రచయిత్రి ఇటువంటి ప్రయత్నం చేయడం అభినందనీయం అంటూ ప్రశంసించారు.