ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్సై 03 శంకర్
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, మార్చి 05 : జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఎస్సై 03 గా విధులు నిర్వహిస్తున్న ఎస్సై శంకర్ బుధవారం ఏసీబీకి పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే..ఇటీవల కోరుట్ల మండలంలోని జోగినిపల్లి గ్రామ శివారులో గత నెలలో మామిడి తోటలో పేకాట ఆడుతూ ఎనిమిది మంది పట్టుబడ్డారు. దాడుల్లో పేకాటరాయుల వద్ద నుండి రూ. 23,000 నగదు స్వాధీనం చేసుకొని కోరుట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఎనిమిది మందిలో ఏడుగురికి సెల్ ఫోన్లు తిరిగి ఇచ్చి, అందులో రాయికల్ మండలం ఉప్పుమడుగు గ్రామానికి చెందిన బండారు శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన సెల్ ఫోన్ మాత్రం తిరిగి ఇవ్వలేదు. ఫోన్ ఇచ్చేందుకు రూ.5,000 డిమాండ్ చేయగా బండారు శ్రీనివాస్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బుధవారం కోరుట్ల పోలీస్ స్టేషన్ లో బండారి శ్రీనివాస్ ఎస్సై 03 శంకర్ కు రూ. 5,000 ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.