దౌల్తాబాద్ లో త్రిపుర బృందం పర్యటన

దౌల్తాబాద్ లో త్రిపుర బృందం పర్యటన

తెలంగాణ కెరటం: దౌల్తాబాద్ /రాయపోలు ప్రతినిధి :మార్చ్ 11

దౌల్తాబాద్ మండలంలోని ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ కు త్రిపుర రాష్ట్రం నుండి 8 మంది సభ్యుల టీం విజిట్ చేయడం చేశారు.వారు ఎఫ్ పిసి మీటింగు, పని విధానం అడిగి తెలుసుకోవడం జరిగింది. మండల మహిళా సమాఖ్య గురించి వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగినది. మహిళా సంఘాలకు ఒక సంఘానికి 20 లక్షల వరకు రుణాలు ఇస్తునది చూసి చాలా బాగా చేస్తున్నారని చెప్పారు. ఎఫ్ బి సి గ్రూప్ ల గురించి అడిగి తెలుసుకుని వారి రాష్ట్రంలో కూడా చెప్పారు. కంపెనీ గురించి, ఇన్పుట్ షాప్, సి హెచ్ సి వలన చేకూరి లాభాలు అడిగి తెలుసుకోవడం జరిగింది వరి ధాన్యం, మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు నిర్వహించే విధానం, మరియు కొనుగోలు వల్ల రైతులకు లాభాన్ని చేకూరుస్తున్నారని అన్నారు. మరియు ఎఫ్ పి సికoపెనీల ద్వారా మహిళలు, యజమానులుగా మారతారని, ఇంకా పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలని ఆకాంక్షించడం జరిగినది . ఇదే మాదిరిగా వారి రాష్ట్రంలో కూడా ఎఫ్ పిసి లు యేర్పాటు చేసి లబ్ధి చేకూరుస్తామని చెప్పడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమానికి సేర్పు డైరెక్టర్ దామోదర్, డిపిఎం వాసుదేవ్ ఏపీఎం సీఈఓ రవీంద్ర చారి.యాదగిరి, రిసోర్స్ టీం బృందం సభ్యులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment