విద్యార్థులతో కూరగాయలు మోపిస్తున్న గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్

విద్యార్థులతో కూరగాయలు మోపిస్తున్న గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్

 

తెలంగాణ కెరటం నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి మర్చి 13

 

 

నారాయణఖేడ్ : నాగలిగిద్ద మండల పరిధిలోని కరస్‌గుత్తి గ్రామంలోని గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థులను చదువు చెప్పాల్సిన ప్రిన్సిపాల్ వారితో కూలీ పనులు చేయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థులు తరగతులకు హాజరయ్యే బదులు కూరగాయలు మోసే పనిలో పాల్గొనాల్సి వస్తోంది. ఈ ఘటనపై తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.విద్యార్థులు చెప్పిన వివరాల ప్రకారం, పాఠశాలలో ప్రిన్సిపాల్ పాఠశాలలో పనులు చేపించడంతో చదువుకు అంతరాయం కలుగుతోందని తెలిపారు. ఈ వ్యవహారంపై సంబంధిత విద్యాశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment