- సూర్య ( సక్సెస్ ) స్కూల్లో సంక్రాంతి వేడుకలు
- ఆకట్టుకున్న రంగవల్లులు, విద్యార్థుల వేశధారణ
ఖమ్మం జనవరి 11 (తెలంగాణ కెరటం): ఖమ్మం నగరంలోని సూర్య (సక్సెస్) ఉన్నత పాఠ శాల ఆవరణలో శనివారం ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. పాఠశాలలో కేవలం విద్యార్థులే సంక్రాంతి ముగ్గుల ను వేయడం అందరికీ ఆకట్టుకుంది. సంక్రాంతి వాతావరణం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేయడం విద్యార్థుల తల్లిదండ్రులకు అలరించింది. పాఠ శాలలో చదువుకుంటున్న 5 నుండి పదో తరగతి విద్యార్థులు రంగు రంగుల ము గ్గులతో సంక్రాంతి విశిష్టతలను ప్రకటించారు. విద్యార్థులకు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను పరిచయం చేయడంతో పాటు వాటి పట్ల అవగాహన కల్పించడం ప్రధాన ధ్యేయంగా సంక్రాంతి సంబరాలను తలపెట్టారు. వీటితోపాటు విద్యార్థుల ఆరోగ్యం పరిరక్షించే విషయంలో పాఠశాల ఇదివరకే దంత, కంటి ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. పాఠశాలలో కేవలం చదువువే కాకుండా సామాజి క బాధ్యతతో విద్యార్థుల అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిండంపై ఖమ్మం సర్వీస్ సర్కిల్ అధినేత నరసింహారావు అభినందించారు. భారతీయ సాంప్రదాయ పండుగలలో ముఖ్యమైన పండుగల్లో ఒకటైన సంక్రాంతి పండుగ యొక్క ఆచార సాంప్రదాయాలను పట్టణంలో ఉన్న విద్యార్థులకు గాని, ఇప్పుడున్న జనరేషన్ కు గాని ఎవరికి తెలియనిదని, వారికి తెలియజేసేటట్లుగా.., ఒక అనుభూతి కలిగేటట్లుగా ఏర్పాటు చేసినందుకు స్కూల్ మేనేజ్మెంట్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ దేవరశెట్టి నాగేశ్వరరావు, పాఠశాల ఇంచార్జిలు కలియర్, రమ్య, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.