ఖేడ్: ఎద్దుల బండి వెళ్లడంతో బాలుడి మృతి
తెలంగాణ కెరటం :నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి జనవరి 11
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం ఐదేళ్ల బాలుడిపై నుంచి ఎద్దుల బండి వెళ్లడంతో మృతి చెందిన ఘటన నారాయణఖేడ్ మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. గైరాన్ తండాకు చెందిన విజయ్ కుమార్, సుమిత్ర భాయ్ చెరుకు నరకడానికి కర్ణాటక రాష్ట్రానికి వలస వెళ్లారు. చెరుకును కట్ చేస్తుండగా కుమారుడు నితిన్ నాయక్(5) అక్కడే ఆడుకుంటున్నాడు. చెరుకు నింపి ఫ్యాక్టరీకి ఎడ్ల బండిపై తరలిస్తుండగా, ఆడుకుంటున్న నితిన్పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.