మాజీ ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి పై కేసు నమోదు.
–మద్దూరు ఎస్సై షేక్ మహబూబ్.
మద్దూరు మండల మాజీ ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి దళిత బంధు పథకం మద్దూరు మండలంలోని రేబర్తి గ్రామనికి చెందిన బచ్చల శ్రీనివాస్ దళితబంధు పథకానికి ఎంపిక చేస్తానని అందుకుగాను 2,50,000 రెండు లక్షల యాభై వేల రూపాయలను ఇవ్వమని చెప్పగా ఎంపీపికి వెంటనే బచ్చల శ్రీనివాస్ ఆ డబ్బులు ఇచ్చాడు.ఆ డబ్బులు ఇచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అయిన ఇప్పటి వరకు దళిత బంధు రాకపోవడంతో వెళ్లి అడగగా అతని అతన్ని కులం పేరుతో దుర్భాషలాడి బెదిరించడంతో పోలిస్ స్టేషన్ పిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై షేక్ మహబూబ్ ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు….