ఖేడ్: బాధితుడికి సీఎంర్ఫ్ చెక్కు అందజేత
తెలంగాణ కెరటం నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి
నారాయణాఖేడ్ మండలం చాప్ట కే గ్రామానికి చెందిన గంగాపురం మోహన్ రెడ్డి వైద్య ఖర్చుల కొరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.56 వేల చెక్కును శనివారం ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ షేట్కార్, పీసీసీ సభ్యులు కే.శ్రీనివాస్ అందజేశారు. పేదల పాలిట సీఎంఆర్ఎఫ్ వరంగా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ గంగయ్య స్వామి, మాజీ ఎంపీటీసీ మారుతీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.