తక్షణమే వికలాంగుల శాఖను ఏర్పాటు చెయ్యాలి .
వికలాంగులకు స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రత్యేక రిజర్వేషన్ కేటాయించాలి .
భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ .
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి
సూర్యాపేట జిల్లా మోతే మండలం . అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా కొనసాగిస్తామన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేటి వరకు వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తించకుండా వికలాంగుల సంక్షేమ శాఖ గొంతు కోసిన తీరును నిరసిస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆధ్వర్యంలో మంగళవారం మోతే మండలం బుర్కచర్ల లో మెడపై కత్తి పెట్టుకొని వికలాంగులు వినూత్న నిరసన తెలిపారు ఈ సందర్భంగా నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె భాగ్యమ్మ ఫౌండేషన్ చైర్మన్ గిద్దె రాజేష్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుని హోదాలో తమ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా గుర్తించి వికలాంగుల సంక్షేమానికి పాటుపడుతామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తయిన నేటివరకు వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తించకుండా వికలాంగుల సంక్షేమ శాఖ గొంతు కోస్తున్న తీరు తమను ఎంతగానో ఆవేదనకు గురి చేస్తుందని అధికారంలో లేనప్పుడు ఒకలా అధికారంలోకి వచ్చినప్పుడు మరోలా విచిత్రమైన తీరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల సమాజాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తించి వికలాంగుల సంక్షేమ శాఖకు 3000 కోట్లు నిధులు కేటాయించి వికలాంగుల సంక్షేమానికి పాటుపడడంతోపాటు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని వెంటనే ప్రత్యేకంగా సమావేశపరిచి ఏండ్ల తరబడి రాజ్యాధికారానికి దూరమైన వికలాంగుల సమాజానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు సంఘం జిల్లా సీనియర్ నాయకుడు ఉప్పునూతల నరసయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు గోగుల శేఖర్ రెడ్డి సంఘం బుర్కచర్ల గ్రామ శాఖ అధ్యక్షులు పేరెల్లి బిక్షం ఉపాధ్యక్షులు సురేష్ జిల్లా మహిళా నాయకురాలు వీరమ్మ సంఘం జిల్లా సీనియర్ నాయకులు జంజిరాల సుధాకర్ సంఘం మండల అధ్యక్షులు పిడమర్తి సైదులు మహిళ నాయకురాలు బుల్లి తదితరులు పాల్గొన్నారు