---Advertisement---

షెడ్యూల్ కులాల్లో ఉప వర్గీకరణ పై వివరణాత్మక అధ్యయనం చేయాలి

---Advertisement---


తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు కొరిపల్లి శ్రీనివాస్

ఖమ్మం, డిసెంబర్​ 12 (తెలంగాణ కెరటం): ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో బహిరంగ విచారణ కోరుతూ గురువారం ఖమ్మం కలెక్టరేట్ కు విచ్చేసిన డాక్టర్ జస్టిస్ సెమీమ్ అత్తర్ ను ఖమ్మం ఎన్ఎస్పి గెస్ట్ హౌస్ లో తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు కొరిపల్లి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించారు. ఎస్సీ 57 ఉప కులాలకు ఎస్సీ వర్గీకరణ ఫలాలు అదేవిధంగా జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరణ చేయాలని, అత్యధిక జనాభా గల మాదిగ కులానికి జనాభా నిష్పత్తి ప్రకారం 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని కొరిపల్లి శ్రీనివాస్ కోరారు. విద్య, ఉద్యోగం, వైద్యం, ఉపాధి రాజకీయ రంగాల్లో అవకాశాల కల్పనలో భాగస్వాములు చేయాలని కోరారు. తెలంగాణ మాదిగ హక్కుల దండోరా సుదీర్ఘం కాలం చేస్తున్న పోరాటాల ఫలితంగా తక్షణమే ఎస్సీ వర్గీకరణ ఏబిసిడిలుగా అమలు చేయాలని కోరుతూ మెమోరడం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పడిశాల వెంకన్న మాదిగ, రాష్ట్ర ఉపాధ్యక్షులు సగ్గుర్తి కోటేశ్వరరావు మాదిగ, ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధి కనకపుడి వీరస్వామి మాదిగ, ఖమ్మం జిల్లా ప్రచార కార్యదర్శి కొండపల్లి మధు మాదిగ, ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు జంగం వెంకయ్య మాదిగ, నండ్రు వెంకన్న మాదిగ చెరుకుపల్లి చిన్న భద్రయ్య మాదిగ, బేడ బుడగ జంగం నాయకులు గంగు స్వామి, రాజేష్ మాదిగ కగ్గుర్తివంశీ మాదిగ, సందీప్ మాదిగ, మహేష్ మాదిగ, వెంకటేశ్వర్లు మాదిగ, రాములు మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment