పొలం పనులు చేస్తుండగా అందులో పడి రైతు మృతి.
తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి జనవరి
పొలం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు పొలంలో పడి ఊపిరాడక ఓ రైతు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో జరిగింది. రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామానికి చెందిన గజం చంద్రం అనే రైతు తన వ్యవసాయ పొలం వద్ద మడిని చదును చేస్తున్నాడు. ఈ క్రమంలో చంద్రం ఒక్కసారిగా పొలంలో ముందుకు పడినట్లు తెలిపారు. గమనించిన కుటుంబ సభ్యులు వెళ్లి చూసేసరికి అప్పటికే చంద్రం ప్రాణాలు విడిచినట్లు తెలిపారు. అయిన సరే కొడుకు బతుకుతాడని ఉద్దేశంతో 108 అంబులెన్స్ లో రామాయంపేటకు తరలిస్తుండగా మార్గమధ్యంలో అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.