పాలెం లో సిరి ఆస్పత్రి నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలోఉచిత వైద్య శిబిరం సక్సెస్
తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 15 :
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో గల మండల పరిషత్, ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం రోజున ఆర్మూర్ పట్టణములో గల సిరి నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరంనిర్వహించారు.ఉచిత వైద్య శిబిరంలో సిరి నర్సింగ్ హోమ్ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్. లింగారెడ్డి,డాక్టర్ బద్దం రాజారెడ్డి,డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ ఈశ్వంత్, డాక్టర్ సౌమ్య లు, ఉచిత వైద్య శిబిరంలో రోగులకు, షుగర్, బి.పి, ఈ.సీ.జీ, బి.ఎం.డి,ఎముకల దృఢత్వం, యూరిక్ యాసిడ్,ఆర్తో,ట్రామా, లాప్రోస్కోపి,క్రిటికల్ కెర్,పలు రోగాల గురైన వారికివైద్య పరీక్షలు, నిర్వహించారు. ఉచిత వైద్య చికిత్సలు చేయించుకున్న రోగులకు, అవసరమయ్యే మందులను ఉచితంగానే అందజేశారు.ఈ సందర్భంగా సిరి నర్సింగో ఉచిత మేఘ వైద్య శిబిరం నిర్వహించిన నేపధ్యంలో, తాజా మాజీ వైస్ ఎంపీపీ. తోగేటి శ్రీనివాస్, రోగులకు సేవా కార్యక్రమాలు అందించారు. ఉచిత శిబిరం నిర్వహించిన, సిరినర్సింగ్ హోమ్ వైద్యులకు, వైద్య సిబ్బందికితాజా మాజీ ప్రజాప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.అంతేకాకుండా గ్రామాలలో సిరి నర్సింగ్ హోమ్ ఆస్పత్రి యాజమాన్యం, గ్రామాలలో ఉచిత శిబిరాలు నిర్వహిస్తూ, రోగులకు సేవలందిస్తూ, ప్రజల ఆధార అభిమానాలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో సిరి నర్సింగ్ హోమ్, వైద్య సిబ్బంది, పాలెం గ్రామ ప్రజలు,గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.