ప్రాథమిక పాఠశాల గుల్లకోటలో ఘనంగా గణిత దినోత్సవం
తెలంగాణ కెరటం ధర్మపురి నియోజకవర్గ ప్రతినిధి డిసెంబర్21
ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త సర్ శ్రీనివాస రామానుజన్ జన్మ దినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా భారత దేశంలో గణిత దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఈ గణిత దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట ప్రాథమిక పాఠశాల లో ఘనంగా ముందస్తు గణిత దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది అలాగే వెల్లటూరు మండలం కుమ్మరపల్లి ఆదర్శ పాఠశాల లో వంద మంది విద్యార్థులు వివిధ రకాల గణిత నమూనాలు ,చార్టులు తయారుచేసి చాలా ఉత్సాహంగా ఈ ఉత్సవంలో పాల్గొనడం జరిగింది.ఆధునిక ప్రపంచంలో గణిత శాస్త్రానికి ఉన్న ప్రాముఖ్యతను మానవ మనుగడలో నూతన ఆవిష్కరణలలో గణితశాస్త్ర ప్రాముఖ్యత ఎంతో ఉన్నదని ప్రపంచ గణిత శాస్త్ర విజ్ఞానంలో ఆర్యభట్ట మొదలు రామానుజన్ మొదలగు అనేకమంది గణిత శాస్త్రంలో భారతీయుల యొక్క ఘనతను చాటి చెప్పడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు చందూరి రాజిరెడ్డి సందర్భంగా విద్యార్థులకు వివరించారు .పాఠశాల ఉపాధ్యాయులు ఎస్ రమాదేవి వి. ప్రశాంత్ ఎన్ నరేష్ కుమార్ కే కృష్ణారెడ్డి అద్భుతమైన ఆకట్టుకునే గణిత నమోనాలు విద్యార్థులతో తయారు చేయించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులుచందూరి రాజిరెడ్డి అధ్యాపకులు ప్రశాంత్ ఐలయ్య ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణ ప్రసాద్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.