రక్తదాన సంధానకర్త కటుకం గణేష్ కు ఘన సన్మానం

రక్తదాన సంధానకర్త కటుకం గణేష్ కు ఘన సన్మానం

 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, జనవరి

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన ప్రముఖ సామాజికవేత్త, రక్తదాన సంధానకర్త, ప్రాణదాత కటుకం గణేష్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు పొందిన సందర్భంగా అడ్లగట్ల గంగాధర్ చారిటబుల్ ట్రస్ట్ కోరుట్ల ఆధ్వర్యంలో ఆదివారం కటుకం గణేష్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కోరుట్ల ప్రాంతంలో ఒకప్పుడు రక్తం దొరకక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. గత 17 సంవత్సరాల క్రితం సామాజికవేత్త, రక్తదాన సంధానకర్త, ప్రాణదాత కటుకం గణేష్ రక్తదాన ఉద్యమాన్ని ప్రారంభించిన నుండి కోరుట్ల ప్రాంతంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలలో రక్తదానానికి కొదవ లేకుండా చేసిన కటుకం గణేష్ ధన్యజీవని కొనియాడారు. మున్ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలను మరిన్ని చేపట్టి ఇంకా మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నం అనిల్, కటుకం జగదీశ్వర్, అబాకస్ శిక్షకులు అడ్లగట్ల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment