రైతన్నకు చేయూత ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన – మునగాల అమరేందర్ రెడ్డి
తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి
రైతుల అభివృద్ధి సంక్షేమ ప్రధాన మోడీ లక్ష్యమని చౌటుప్పల మండలం బిజెపి కిసాన్ మోర్చా అధ్యక్షులు మునగాల అమరేందర్ రెడ్డి అన్నారు. రైతుల పెట్టుబడి సాయంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇస్తున్న 6వేలను 10వేలకు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతుల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉన్న ప్రభుత్వం మాది అని అన్నారు. దేశానికి అన్నం పెట్టేందుకు శ్రమించే మన రైతులు గర్వకారణం అని తెలిపారు. రైతన్నలు ఏ పంట సాగుచేసిన డి ఏ పి ఎరువులను వినియోగిస్తారని అన్నారు. ఎరువు బస్తాను 1350 రూపాయలు చొప్పున ఇచ్చేందుకు 3850 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం పట్ల కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేశారు.దీంతో దేశంలో కోట్ల మంది రైతులకు ఆరు ఏండ్లుగా ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతులకు మరింతగా చేయూతనివ్వలన్న ఇవ్వాలని సంకల్పంతో ప్రధాన మోడీ పెట్టుబడి సాయాన్ని పదివేలుకు పెంచాలని రైతుల అభివృద్ధి కోసం ఎంత చేసిన తక్కువేనని, ప్రధానమంత్రి చారిత్రాత్మకమని కొనియాడారు. పెట్టుబడి సాయం పెంచడం పట్ల రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని రైతుల పక్షాన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. పేదల సొంతింటి కల నేరవెర్చేనందుకు రెండు కోట్ల ఇళ్ల నిర్మాణాలు చేస్తూ చేపట్టినట్టు ప్రకటించారని, ఈ నిర్ణయంతో అర్హులైన పేదలకు ఇల్లు మంజురై వారికి సొంత ఇంటి కల నెరవేరుతుంది అన్నారు. ప్రధాని మోడీ నిరంతరం రైతులు ప్రజా సంక్షేమం, కోసం పాటుపడుతున్నారని ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రధాని మోడీ బిజెపి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.