ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన న్యాయమూర్తి.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్
వృద్ధులకు విశ్వశాంతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత న్యాయ సలహా కేంద్రమును వృద్ధాశ్రమాన్ని శనివారం లోకథలు చైర్మన్ మరియు జూనియర్ సివిల్ జడ్జి గుంటి జ్యోత్స్న ఆకస్మిక తనిఖీ చేశారు.ఉన్నత న్యాయ స్థానం ఆదేశాల మేరకు మండల న్యాయ సేవ సంఘం, నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని ప్రతి నెలా సందర్శించాలని ఉత్తర్వుల్లో భాగంగా వచ్చానని, వృద్ధుల యోగ క్షేమాలు కనుక్కొని వారికి అందుతున్న సౌకర్యాలు, న్యాయ సేవలో భాగంగా వారికి ఏమైనా సమస్యలు ఉంటే పారా లీగల్ వాలంటీర్ ద్వారా మా దృష్టికి వస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని న్యాయమూర్తి తెలిపారు. న్యాయమూర్తి వెంట లోక్ అదాలత్ ఇంఛార్జి భోగ హరికృష్ణ, పారా లీగల్ వాలంటీర్ డి. మధుసూధన్, ఇంఛార్జి కోర్టు కానిస్టేబుల్ ఇస్మాయిల్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. న్యాయమూర్తి జ్యోత్స్న గుంటి వృద్దులకు బిస్కెట్లు పంపిణీ చేశారు.