అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీ వాహనాన్ని పట్టుకున్న
–మోర్తాడ్ ఎస్సై బి విక్రమ్
తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 21 :
నిజామాబాద్ జిల్లామోర్తాడ్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి నుండి భారీ వాహనంలో ఇసుక అక్రమంగా తరలిస్తున్న విషయమై, విశ్వసనీయ సమాచారం మేరకు మోర్తాడ్ మండల ఎస్సై,బి.విక్రమ్ పట్టుకున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న భారీవాహాన్ని పట్టుకోవడమే కాకుండా, పోలీస్ స్టేషన్ కు తరలించి, అక్రమంగా తరలిస్తున్న వాహనంపై తగుచర్యకై మోర్తాడ్ మండల రెవెన్యూ అధికారులకు అప్పగించడం జరిగిందని, ఎస్సై బి.విక్రమ్ తెలిపారు.