లగచర్ల రైతులపై అక్రమ కేసులపై కామారెడ్డి BRS పార్టీ అద్వర్యంలో నిరసన కార్యక్రమం
లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైలలో నిర్బంధించి రైతుల చేతులకు బేడీలు వేసినా కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ అమానవీయ అనచివేత విధానాల నిరసనకు రైతన్నల పై నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేయాలని వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపు మేరకు కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్, BRS పార్టీ కామారెడ్డి జిల్లా అద్యక్షులు యంకె ముజీబోద్దిన్ గార్ల ఆదేశాల మేరకు ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే కమాన్ బ్రిడ్జి వద్ద గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన అనంతరం నిరసన తెలిపడం జరిగింది
ఇట్టి నిరసన కార్యక్రమంలో పట్టణ BRS పార్టీ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, BRS పార్టీ కామారెడ్డి నియోజకవర్గ అధికారి ప్రతినిధి గైని శ్రీనివాస్ గౌడ్ కౌన్సిలర్లు గెరిగంటి లక్ష్మినారాయణ, కృష్ణాజీరావు, యూత్ అద్యక్షులు భానుప్రసాదు, జాగృతి జిల్లా అద్యక్షులు అనంత రాములు సీనియర్ నాయకులు మల్లేష్ యాదవ్, లద్దురి కృష్ణ యాదవ్, సంగి మోహన్, వేంకటి, నిట్టు లింగరావు, రాజేందర్, షౌకత్, శ్రీనివాస్, నర్సింలు, నరేందర్, రాజు, శ్యాం, వడ్ల శ్రీనివాస్ మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు