ప్రభుత్వం చర్చి కోసం కేటాయించిన భూమిని తిరిగి చర్చికి అప్పగించాలని వినతి.

ప్రభుత్వం చర్చి కోసం కేటాయించిన భూమిని తిరిగి చర్చికి అప్పగించాలని వినతి.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి జనవరి

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని వలపట్ల కాలనీలో గల చర్చి అభివృద్ధి కోసం కేటాయించిన అన్యాక్రాంతమైన కబ్జాకు గురైన భూమిని తిరిగి చర్చికి అప్పగించాలని కోరుతూ వలపట్లకు చెందిన క్రైస్తవులు సోదరులు గురువారం అచ్చంపేట పట్టణం ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అచ్చంపేట పట్టణంలోని సర్వే నంబర్ 293లో 4.32 ఎకరాలు మరియు సర్వేనెంబర్ 93లో 1. 32 ఎకరాలు భూమిని అచ్చంపేట పట్టణంలోని వలపట్ల కాలనీలో 1952లో చర్చి కోసం కేటాయించారని అట్టి స్థలంలో సీయోను ఎంపీ చర్చి నిర్మించారని ఆ చర్చిలో యూనఫ్ పంతులను పాస్టర్ గా నియమించడం జరిగిందని, 1953-54 సంవత్సరంలో చర్చి అభివృద్ధి కోసం 293 సర్వేలో 4.32 మరియు 68 సర్వే నెంబర్లు 1.32 ఎకరాలను కేటాయించి చర్చి పేరును రిజిస్ట్రేషన్ చేయించుటకు వీలునందున అట్టి భూమిని చర్చి పాస్టర్ అయిన యునఫ్ పంతులు పేరున రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని, కాలక్రమమైన అట్టి భూమిని వారి వారసులు అనుభవిస్తూ ఉన్నారని, కానీ అట్టి ప్రభుత్వ భూమిని చర్చి సభ్యులు నిర్వాహకులకు,మా క్రైస్తవ సోదరులకు ఎవరికీ తెలియకుండా ఇతరులకు దొంగ చాటుగా అమ్ముకొని రిజిస్ట్రేషన్ చేశారని, ఈ విషయమై ఈ మధ్యనే మా దృష్టికి రావడంతో విచారించగా చర్చికి కేటాయించిన భూమిని దొంగ చాటున ఇతరులకు అమ్మినట్లు వెళ్లడైందని, నిజానికి చర్చికి కేటాయించిన భూమిని ప్రైవేట్ భూమి గా చూపిస్తూ దొంగ చాటున ఇతరులకు క్రయవిక్రయాలు జరిపారని రుజువు కావడంతో కావున దయచేసి అట్టి భూమిని తిరిగి చర్చి కోసం చర్చి అభివృద్ధి కోసం క్రైస్తవ సోదరులకు అప్పగించాలని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment