తాండూర్ గ్రామంలో విజయవంతమైన మెగా వైద్య ఆరోగ్య శిబిరం.
ఉచితంగా మందుల పంపిణీ.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 21:
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రామాయంపేట లయన్స్ క్లబ్ ఆప్ (స్నేహబందు), లైన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని తాండూరు గ్రామంలో మెగా వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు.అయితే తాండూరు గ్రామానికి చెందిన అడ్వకేట్ భూమా రవికుమార్ గౌడ్ హెల్త్ క్యాంపు చైర్ పర్సన్ పులిసే దామోదర్ రావు ను కలిసి తమ గ్రామంలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. కాగా గ్రామంలో నిర్వహించిన హెల్త్ క్యాంపులో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించుకున్న వారికి ఉచితంగా మేడ్చల్ మెడిసిటీ హాస్పిటల్ యాజమాన్యం మందులను పంపిణీ చేసింది. ఆపరేషన్లు అవసరం ఉన్న వారిని సోమవారం ప్రత్యేక వాహనములో ఆసుపత్రికి తీసుకెళ్లి ఉచితంగా చేస్తామని దామోదర్ రావు తెలిపారు.