అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ.
విద్యార్థులతో కలిసి అక్కడే బస చేసిన డిఇఓ.
డీఈవో రమేష్ కుమార్.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఫిబ్రవరి 12):
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను మంగళవారం రాత్రి నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులకు వండిన భోజనాన్ని ఆయన పరిశీలించారు.టీచర్స్ మెస్ కమిటీతో భోజనం ఎలా ఉందో ఆరా తీశారు.బియాన్ని పరిశీలించి, బియ్యం స్టాక్ రిజిస్టర్‌ను చెక్ చేశారు.వండే బియ్యాన్ని ఒకరోజు ముందే శుభ్రం చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలని వంట ఏజెన్సీకి సూచించారు.అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ ముచ్చటించారు. విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయని, ఇంకా ఏమైనా ఏర్పాటు చేయాలని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.రెండు జతల యూనిఫామ్, పుస్తకాలు నోటి పుస్తకాలు విద్యార్థులకు అందినవా లేదా అని అడిగి తెలుసుకున్నారు.అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఏ వైనా సమస్యలుంటే నివేదిక ఇవ్వాలని పాఠశాల ప్రిన్సిపాల్ ను ఆదేశించారు.పాఠశాలలో చదువులు, వసతులు, సమస్యలు తదితర అంశాలను నిశితంగా ఆయన పరిశీలించారు. పాఠశాలలో పరిశుభ్రతపై అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్యం పరిశుభ్రత అత్యంత కీలకమని సూచించారు.ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారమే విద్యార్థులకు భోజనాన్ని అందించాలని, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకునే విద్యార్థులంతా తల్లిదండ్రులు లేని విద్యార్థులని విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని డిఇఓ ఆదేశించారు.అనంతరం విద్యార్థులతో కలిసి పాఠశాలలోనే డిఇఓ రాత్రి బస చేయనున్నారు.