దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళకు అరుదైన శస్త్రచికిత్స

దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళకు అరుదైన శస్త్రచికిత్స

 

మహిళ కడుపులో ఐదు కిలోల మల్టిపుల్ ఫైబ్రాడ్ గడ్డ, గర్భసంచి తొలగింపు

డాక్టర్”హేమరాజ్ సింగ్

దుబ్బాక:జనవరి11, (తెలంగాణ కెరటం )దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ఓ మహిళ కడుపులో మల్టిపుల్ ఫైబ్రాయిడ్ గడ్డలు, గర్భసంచి తొలగించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆసుపత్రి డాక్టర్”హేమరాజ్ సింగ్ వెల్లడించారు. దుబ్బాక గ్రామానికి చెందిన గుండ్ల అపర్ణ గత రెండు సంవత్సరాల నుండి కడుపు నొప్పితో బాధపడుతూ దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. మెడికల్ సూపరిండెంట్ డాక్టర్”హేమ్రాజ్ సింగ్ ఆమెకు అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి కడుపులో మల్టిపుల్ ఫైబ్రియిడ్ గడ్డలు ఉన్నాయని నిర్ధారణ చేసి రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద మహిళకు ఆపరేషన్ చేసి మల్టిపుల్ ఫైబ్రాయిడ్ గడ్డను, మరియు గర్భసంచిని తొలగించినట్టు తెలిపారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. అరుదైన శస్త్ర చికిత్స చేసి మహిళ ప్రాణాలు కాపాడిన వైద్య బృందానికి, సిబ్బందికి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment