చెరువులో మునిగి యువకుడి మృతి.
తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్
దశదినకర్మ రోజు చెరువులో స్నానానికి వెళ్లిన ఓ యువకుడు నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందిన ఘటన రామాయంపేట మండలంలో జరిగిందని రామాయంపేట ఎస్ ఐ బాలరాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం… ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన నక్కని స్వామి (21) అనే యువకుడు సోమవారం బంధువులతో కలిసి చెరువు వద్ద స్నానానికి వెళ్లి నీటిలో మునిగిపోయాడు. చెరువులో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ బాలరాజు తెలిపారు.