టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీర్గా ఎంపికైన యువకుడు
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం బుజీరాంపేట గ్రామానికి చెందిన చింతల వెంకటేశం-యాదమ్మల కుమారుడు చింతల వేణుప్రసాద్, ఇటీవల జరిగిన టీపీబో పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 15వ ర్యాంక్ సాధించి తన ప్రతిభతో టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాన్ని పొందాడు. పాఠశాల విద్యను జడ్.పి.హెచ్.యస్ బుజీరాంపేటలో పూర్తి చేసిన వేణుప్రసాద్, సివిల్ ఇంజినీరింగ్‌ను కాకతీయ యూనివర్సిటీలో చదివి, మాస్టర్స్ ఆఫ్ ఇంజినీరింగ్‌ను ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశాడు.ప్రత్యేక కోచింగ్ లేకుండా తన స్వశక్తితోనే ఈ స్థాయి విజయాన్ని అందుకున్న వేణుప్రసాద్, ఇంతకు ముందే గ్రూప్-4 ఉద్యోగాన్ని కూడా సాధించాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అతడిని అభినందిస్తూ అతని విజయాన్ని ప్రశంసించారు. తల్లిదండ్రుల కష్టమే తన విజయానికి ప్రధాన కారణమని, వారి ప్రోత్సాహం తనను ఈ స్థాయికి తీసుకువచ్చిందని వేణుప్రసాద్ తెలిపాడు.