*ప్రభుత్వ లక్ష్యం మేరకు పేదలకు ఇళ్లస్థలాలు ఉండి ఇల్లు లేని అందరికీ ఇల్లు ఇవ్వడానికి అధికారులు జాగ్రత్త సర్వే చేయాలి*
*ప్రభుత్వ లక్ష్యం మేరకు పేదలకు ఇళ్లస్థలాలు ఉండి ఇల్లు లేని అందరికీ ఇల్లు ఇవ్వడానికి అధికారులు జాగ్రత్త సర్వే చేయాలి*
తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 23):
అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని బర్రె జహంగీర్ మాజీ ముప్పల్ చైర్మన్ కోరారు. ఈమేరకు సోమవారం భువనగిరి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారుల కోసం జరుగుతున్న సర్వే పనులను పరిశీలించి సర్వేచేస్తున్న తీరును పరిశీలించి లబ్దిదారులను గుర్తించేలా చూడాలని కోరారు. ఇక్కడ నివాసిస్తున్న పేద ప్రజలు ఎన్నో ఏండ్ల క్రితం నుంచి ఇక్కడి లావుణి పట్టా భూములు కొనుగోలు చేసి జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం నిరుపేద కుటుంబాల పరిస్థితి దృష్టిలో పెట్టుకొని పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆయన కోరారు ఆయన వెంట ఇందిరమ్మ కమిటీ సభ్యులు చల్ల కిషోర్ కుమార్,, భూషపక బిక్షపతి, పాదం సత్యనారాయణ ఆన్లైన్ డౌన్లోడ్ ఇన్చార్జి కాకునూరి రాము తదితరులు పాల్గొన్నారు