శ్రీ ఉమామహేశ్వర దేవస్థానానికి భారీ విరాళం అందించిన అచ్చంపేట రెడ్డి సేవా సంఘం.
తెలంగాణ కెరటం అచ్చంపేట (నవంబర్ 30):
అచ్చంపేట మండల పరిధిలో గల శ్రీశైల ఉత్తరముఖ ద్వారమైన శ్రీ ఉమామహేశ్వర పుణ్యక్షేత్రానికి అచ్చంపేట రెడ్డి సేవా సంఘం నేతలు 25 లక్షల భారీ విరాళాన్ని ఆలయ చైర్మన్ బీరo మాధవరెడ్డికి చెక్ ను రెడ్డి సేవా సంఘం అధ్యక్షులు రామకృష్ణ రెడ్డి, సంఘం అందజేశారు. ఈ సందర్భంగా రెడ్డి సేవా సంఘం అధ్యక్షులు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ క్రి.శే. శ్రీ మర్యాద గోపాలరెడ్డి శ్రీ ఉమామహేశ్వర క్షేత్రం అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, వారి స్ఫూర్తితో రెడ్డి సంఘం తరుపున ఆలయ అభివృద్ధికి తమవంతు పాత్ర పోషించి శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో చేపట్టే ప్రతి కార్యక్రమంలో రెడ్డి సేవా సంఘం భాగస్వామ్యం వుంటుంది అని రెడ్డి సేవా సంఘం అధ్యక్షులు రామకృష్ణ రెడ్డి తెలియచేశారు.శ్రీ ఉమామహేశ్వర దేవస్థానంలో శ్రీ ఉమామహేశ్వర చైర్మన్ బీరం మాధవరెడ్డి ఆధ్వర్యంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి సన్నిధిలో రెడ్డి సేవ సంఘం నాయకులు ప్రత్యెక పూజలు హోమం చేసి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధి కోసం భారీ విరాళం అందించడం జరిగిందన్నారు ,రెడ్డి సంఘం నాయకులకు సన్మానం చేసి ప్రత్యెక ధన్యవాదాలు తెలియచేశారు,వారికి శ్రీ ఉమామహేశ్వర స్వామి అనుగ్రహం ఎల్ల వేళలా వుండాలని,వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో. రెడ్డి సేవా సంఘం నాయకులు. శ్రీ ఉమామహేశ్వర దేవస్థాన మాజీ చైర్మన్ రామకృష్ణ రెడ్డి డా. గోవర్దన్ రెడ్డి ,ఆడపాల గోపాల్ రెడ్డి,నరేందర్ రెడ్డి ,కృష్ణారెడ్డి,తిరుపతి రెడ్డి ,జైపాల్ రెడ్డి,మహిపాల్ రెడ్డి, బాల్ రెడ్డి,వెంకట్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, అడ్వకేట్ చంద్రా రెడ్డి, రెడ్డి సేవా సంఘం నాయకులు ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.