సహకార సంఘంలో అవినీతిపై చర్యలు తీసుకోవాలి
కోటి రూపాయల నిధుల గోల్ మాల్ పై కలెక్టర్ కు ఫిర్యాదు
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, జనవరి
జగిత్యాల జిల్లా ధర్మపురి సహకార సంఘంలో కోటి రూపాయల నిధులు దుర్వినియోగం చేసిన భాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ధర్మపురికి చెందిన జె.సురేందర్ కుమార్ సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రజావాణిలో కలెక్టర్ సత్యప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఫిర్యాదు దారుడు జె.సురేందర్ కుమార్ మాట్లాడుతూ సహకార సంఘంలో తాను సభ్యునిగా ఉన్నానని, గతంలో సహకార సంఘంలో 01 కోటి 24 లక్షల 30 వేల 688 రూపాయల నిధులు దుర్వినియోగం జరిగినట్లు జిల్లా సహకార సంఘం అధికారి నిర్ధారిస్తూ ధర్మపురి సింగిల్ విండో అధ్యక్ష కార్యదర్శులకు, పాలకవర్గానికి గత సంవత్సరం సంజాయిషీ నోటీసు జారీ చేశారని అయినా ఇప్పటివరకు బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే నిధుల గోల్ మాల్ చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, దుర్వినియోగం చేసిన నిధులను వెంటనే రికవరీ చేయాలని కోరారు.