ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా డిజేపిఆర్ సంస్థపై చర్యలు తీసుకోవాలి .
అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులా!
కొత్తపల్లి రేణుక సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ సూర్యాపేట డివిజన్ కార్యదర్శి.
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణంలో జరిగే లోపాలను సరిదిద్దాలని,అవినీతిని అరికట్టాలని,అవినీతికి పాల్పడుతున్న డిజేపీర్ కాంట్రాక్ట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హాస్పిటల్ ముందు రోడ్డు పై సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ సూర్యాపేట డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిపిజేఆర్ సంస్థ కాంట్రాక్టు దక్కించుకొని దాని డిపిఆర్ మార్చి కన్స్ట్రక్షన్ పనులు మొదలుపెట్టారు అన్నారు.పని చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రక్షణ చర్యలు పాటించాలి కానీ ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదు అన్నారు.దీని మూలంగా రోగుల మరియు రోగుల సహాయకుల పై దుమ్ము,దూళి, సిమెంటు ఇటుకలు పడుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. ఇదే విషయమై గతంలో హాస్పిటల్ ను మా పార్టీ ఆధ్వర్యంలో సందర్శించినపుడు అనేకమార్లు సూపెరెండెంట్ దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. ఆ తర్వాత డిఎంహెచ్ఓ,కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చిన ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదన్నారు.నిర్మాణ పని విధానంలో ఎలాంటి మార్పులు లేకుండా యధాతధంగా పనులు కొనసాగిస్తున్నారు అన్నారు.ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసి ఈ రోజు హాస్పిటల్ లో జరిగే నిర్మాణ పనులు పరిశీలించి అక్కడ ఉన్న వర్కర్స్ ను ప్రశ్నిస్తే మేము ఇలాగానే చేస్తాం మా ఇష్టం అంటూ నిర్లక్ష్య సమాధానం చెప్తున్నారు అన్నారు.వారి అవినీతిని,నిర్మాణంలో జరిగే లోపాల్ని,రక్షణ చర్యలు తీసుకోకుండా నిర్మిస్తున్న విధానాల్ని ఖండిస్తూ అక్కడికొచ్చి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరుతూ సూర్యాపేట ఏరియా హాస్పిటల్ ముందు రోడ్డు పై ధర్నా చేస్తుంటే పోలీసులు అత్యుత్సాహం చూపి టౌన్ స్టేషన్ తీసుకెళ్లి అక్రమ కేసులు పెట్టారు అన్నారు.ఈ సమాజంలో అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం ఇదెక్కడి ఆటవిక న్యాయమని ప్రశ్నించారు.ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకునేది పోయి,కాంట్రాక్టర్ అక్రమ పద్ధతులను ప్రశ్నిస్తే మా మీద కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయమని అన్నారు. ఇకనైనా పోలీసులు పోరాడే వారిపై కక్షపాత వైఖరి మానుకొని ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారిని గుర్తించాలని కోరారు.అన్ని వర్గాల ప్రజలు ఈ అక్రమ కేసులనూ ఖండించాలని కోరారు.తక్షణమే అధికారులు స్పందించి నిర్మాణ పనుల దగ్గర రక్షణ చర్యలు చేపట్టి,అవినీతికి పాల్పడుతూ ప్రజల ప్రాణాల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్న ఆ సంస్థపై చర్యలు తీసుకోని, కాంట్రాక్ట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిడీఎస్యు రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్,సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య,పట్టణ కార్యదర్శి గులాం హుస్సేన్,డివిజన్ నాయకులు ఎస్కే.సయ్యద్,పిఓడబ్ల్యు జిల్లా అధ్యక్షులు మారసాని చంద్రకళ, సహయ కార్యదర్శి సంతోషి మాతా,చిత్తలూరి లింగయ్య, వీరబాబు,విజయ్, జాన్ సుందర్, పద్మ, అనసుర్య,కల్పన, అరుణ, గౌరమ్మ,రేణుక,మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.